Advertisement

  • ఫ్యూచర్ ప్లాన్స్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన "పునర్నవి భూపాలం"

ఫ్యూచర్ ప్లాన్స్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన "పునర్నవి భూపాలం"

By: chandrasekar Thu, 25 June 2020 12:20 PM

ఫ్యూచర్ ప్లాన్స్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన "పునర్నవి భూపాలం"


యువతీ యువకుల మధ్య పుట్టే ప్రేమే చాలా స్వచ్చంగా ఉంటుంది. అలాంటి ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం అంటోంది 24 ఏళ్ల పునర్నవి భూపాలం. తన పెళ్లి, కాబోయే వరుడు, పుట్టబోయే బిడ్డలు ఫ్యూచర్ ప్లాన్స్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది పునర్నవి భూపాలం.

నా లైఫ్‌కి సంబంధించిన ప్రతి విషయాన్ని పబ్లిక్‌తో షేర్ చేసుకోవాలని అనుకోవడం లేదు. అది నాకు ఇష్టం ఉండదు. నా లైఫ్‌లో లవ్‌కి అర్థం చెప్పాలంటే చాలా సింపుల్. 18-19లో ఉండే ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం.

ఓల్డ్ అథంటిక్ లవ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం ఒకరికోసం ఒకరు కావాలని అనిపిస్తుంది. ప్రేమను ఇచ్చాము అంటే మళ్లీ తీసుకోవాలని అనిపిస్తుంది. అలాంటి ప్రేమ నాకు ఇష్టం.

ఈ కాలంలో ఇలాంటి ప్రేమ దొరకడం లేదు. ఎందువల్ల అంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయి.. సోషల్ మీడియా ఎక్కువైపోయింది. చాలా డేటింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చేశాయి. వీటివల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీటినే లవ్ అనుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన ప్రేమను వెతుక్కోవడం అనేది చాలా కాంప్లికేట్. అయితే నిజమైన ప్రేమ దొరకదు అని కాదు కాని ఏదో ఒక రోజు దొరుకుతుందిలే అని చూడాల్సిన పరిస్థితి.

ఇక నేను పెళ్లి చేసుకునే వాడికి ఉండాల్సిన క్వాలిటీస్ విషయానికి వస్తే.. నన్ను భరించాలి. నాలో 70 పర్శనాలిటీస్ ఉన్నాయి. బిగ్ బాస్‌లో నాలో ఉన్న ఆరు షేడ్స్ చూశారు. వాటిని భరించగలగాలి. నన్ను నా లైఫ్‌ని అర్థం చేసుకోవాలి. నేను ఇండిపెండెంట్ ఉమెన్‌గా ఉండాలని అనుకుంటున్నా, పెళ్లైన తరువాత కూడా పనిచేస్తా. నా పనిని అతను గౌరవించాలి. నేను చేసే వాటిని యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. నా విషయంలో చాలా పెద్ద పెద్దవి యాక్సెప్ట్ చేయాల్సి ఉంది. జోవియల్‌గా, పాజిటివ్‌గా ఉండాలి. నేను పనిచేసినా తాను ఇంట్లో ఉన్నా జస్ట్ చిల్ అనిపించేలా అతను ఉండాలి.

నేను పెళ్లి చేసుకోవడానికి 6-7 ఏళ్లు పడుతుంది. నా పనితో పాటు నా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ కావాలి. ఈరోజు పెళ్లి చేసుకోవాలి అని అనిపించినప్పుడు అప్పుడే చేసుకుంటా. సిటీకి దూరంగా ఇద్దరు పిల్లలతో సింపుల్‌గా లైఫ్ ఉండాలని కోరుకుంటున్నా. ఇదంతా జరగడానికి మరో 20 ఏళ్లు పడుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు పునర్నవి.

Tags :

Advertisement