Advertisement

  • ఇంటర్వ్యూలో తెలుగు కమెడియన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రగతి

ఇంటర్వ్యూలో తెలుగు కమెడియన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రగతి

By: chandrasekar Sat, 18 July 2020 10:56 AM

ఇంటర్వ్యూలో తెలుగు కమెడియన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రగతి


ప్రగతి టాలీవుడ్‌లో ఉన్న ఫీమేల్ కారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరు. హీరోయిన్ తల్లిగా వదినగా చాలా సినిమాలు చేసింది ఈమె. అప్పట్లో చిరుత సినిమాలో రామ్ చరణ్ తల్లిగా కూడా ఈమె నటించింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది తనకంటే చాలా పెద్ద హీరోలకు కూడా అమ్మగా నటించింది ప్రగతి. వందలాది సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తెలుగు స్టార్ కమెడియన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌లో పేరు మోసిన కమెడియన్ ఒకరు తనతో మిస్ బిహేవ్ చేసాడని అసభ్యకరంగా ప్రవర్తించాడని సంచలన విషయం బయటపెట్టింది ప్రగతి. ఈ ఇంటర్వ్యూలో ఇంకా చాలా విషయాలు చెప్పింది ఈ సీనియర్ నటి. కమెడియన్ పేరు అయితే చెప్పలేదు కాని చాలా ఎక్స్‌ట్రాలు మాత్రం చేసాడని చెప్పుకొచ్చింది ఈమె.

ఆ సమయంలో ఆయన చాలా పెద్ద స్టార్ కమెడియన్ అని ఏడాదికి 20,30 సినిమాలు చేస్తున్నాడని చెప్పింది. తనతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో తనను కావాలని ఇబ్బంది పెట్టాడని పదే పదే మాట్లాడేందుకు ప్రయత్నించడంతో పాటు ముట్టుకోడానికి ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది.

అతడి మాటలు చేష్టలు తనకు చాలా ఇబ్బందిని కలిగించాయని అందుకే విషయం చాలా దూరం వెళ్లకుండా వెంటనే తాను అతడితో మాట్లాడానని చెప్పింది ప్రగతి. ఓ రోజు షూటింగ్ ముగిసిన తర్వాత కారావ్యాన్‌లోకి తీసుకెళ్లి మీ మాటలు చేష్టలు చాలా ఇబ్బందిగా ఉన్నాయని ప్రవర్తన అస్సలు బాగోలేదని ప్రవర్తన మార్చుకోకుంటే బాగోదని వార్నింగ్ ఇచ్చానని చెప్పింది. అక్కడితో ఆయన సైలెంట్ అయిపోయాడని లేదంటే అనవసరంగా పెద్ద ఇష్యూ అయ్యేదని గుర్తు చేసుకుంది ఈమె. ఆ తర్వాత కూడా షూటింగ్‌లో కలిసినా ఎప్పుడూ తనతో అలా ప్రవర్తించలేదని వార్నింగ్ బాగానే పని చేసిందని ప్రగతి చెప్పింది.

Tags :

Advertisement