Advertisement

  • Viral News: పబ్లిక్ ప్లేస్‌లో రొమాన్స్... మీడియా కంట పడ్డా స్టార్ హీరోయిన్...!

Viral News: పబ్లిక్ ప్లేస్‌లో రొమాన్స్... మీడియా కంట పడ్డా స్టార్ హీరోయిన్...!

By: Anji Mon, 14 Dec 2020 3:05 PM

Viral news: పబ్లిక్ ప్లేస్‌లో రొమాన్స్... మీడియా కంట పడ్డా స్టార్ హీరోయిన్...!

రహస్యంగా డేటింగ్ చేస్తున్న సమయంలో నిక్ జోనస్.. ప్రియాంక చోప్రా పబ్లిక్ ప్లేస్‌లో రొమాన్స్ చేయడం ద్వారా మీడియా కంట పడ్డారు.

అప్పుడే వీళ్ల బంధం బయటకు వచ్చింది. ఇక, వివాహం తర్వాత వీళ్లిద్దరూ మరింతగా రెచ్చిపోతున్నారు. తరచూ ముద్దులు పెట్టుకోవడం, రొమాంటిక్‌గా ఫోజులివ్వడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ అయ్యారు.

ప్రియాంక చోప్రా ప్రస్తుతం ‘టెక్ట్స్ ఫర్ యూ’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం అమ్మడు భర్తతో కలిసి లండన్‌కు వెళ్లింది. కొద్ది రోజులుగా వీళ్లిద్దరూ అక్కడ హల్‌చల్ చేస్తున్నారు.

వీకెండ్ పార్టీలు, హాలిడే ట్రిప్పులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిక్ కారులో ఓ పని చేయడంతో వీళ్లిద్దరి మధ్య ఊహించని సంఘటన జరిగినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.

లండన్ వీధుల్లో కారులో ప్రయాణిస్తున్న సమయంలో నిక్ జోనస్.. ఓ విషయం గురించి ప్రియాంక చోప్రాతో గొడవకు దిగాడట. దీంతో అతడిపై సీరియస్ అయిన ఆమె… కారులో నుంచి అతడిని బయటకు తోసిసిందని విశ్వసనీయంగా తెలిసింది.

ఈ ఘటన తర్వాత ఇద్దరూ వేరు వేరు కార్లలో హోటల్‌కు వెళ్లిపోయారని బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది.

Tags :

Advertisement