Advertisement

  • రాధేశ్యామ్ నుంచి ప్రభాస్ సర్ప్రైజ్ లుక్ విడుదల

రాధేశ్యామ్ నుంచి ప్రభాస్ సర్ప్రైజ్ లుక్ విడుదల

By: Sankar Wed, 21 Oct 2020 12:28 PM

రాధేశ్యామ్ నుంచి ప్రభాస్ సర్ప్రైజ్ లుక్ విడుదల


ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌‌తో పాటు టైటిల్‌‌తో కూడిన పోస్టర్‌ను ఇటీవలే రిలీజ్ చేసారు చిత్రయూనిట్ . ఈపోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇక అక్టోబర్ 23న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుంచి 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పేరుతో మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి మరో సర్ ప్రైజ్ విడుదల చేసింది ఈ చిత్ర యూనిట్. ఈ మూవీలో ప్రభాస్ నటిస్తున్న "విక్రమాదిత్య" రోల్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అంతేకాదు ప్రభాస్ కు అడ్వాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది.

కాగా ఈ సినిమాకు పలు హిట్‌ చిత్రాలకు స్వరాలందించిన జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్‌ జరుగుతుంది ..ప్రభాస్ అభిమానులు ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు

Tags :
|

Advertisement