Advertisement

  • ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో పూజా హెగ్డే‌తో రొమాంటిక్ పోజిస్తూ కనిపించిన ప్రభాస్

ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో పూజా హెగ్డే‌తో రొమాంటిక్ పోజిస్తూ కనిపించిన ప్రభాస్

By: chandrasekar Sat, 11 July 2020 2:21 PM

ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో పూజా హెగ్డే‌తో రొమాంటిక్ పోజిస్తూ కనిపించిన ప్రభాస్


ఎంతగానో ఎదురుచూసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఆ క్షణం వచ్చేసింది. ప్రభాస్ 20వ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో హీరోయిన్ పూజా హెగ్డే‌తో రొమాంటిక్ పోజిస్తూ కనిపించి తన అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చారు ప్రభాస్.

విడుదలైన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిన ఈ పోస్టర్ చూసి రెబల్ స్టార్ మురిసిపోతున్నారు. ముందుగా అనుకున్నట్లుగానే ఈ సినిమాకు ''రాధే శ్యామ్'' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాను కూడా ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా ప్యాన్ ఇండియా మూవీ గానే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 1960 దశకం నాటి ప్రేమకథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

ఇందులో ప్రభాస్ ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా కనిపించనుంది. సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళీ శర్మ, సాషా ఛేత్రి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Tags :
|
|

Advertisement