Advertisement

  • ప్రభాస్ కొత్త సినిమా 'రాధే శ్యామ్ '..రొమాంటిక్ లుక్ లో అదరగొట్టిన యంగ్ రెబెల్ స్టార్

ప్రభాస్ కొత్త సినిమా 'రాధే శ్యామ్ '..రొమాంటిక్ లుక్ లో అదరగొట్టిన యంగ్ రెబెల్ స్టార్

By: Sankar Fri, 10 July 2020 10:54 AM

ప్రభాస్ కొత్త సినిమా 'రాధే శ్యామ్ '..రొమాంటిక్ లుక్ లో అదరగొట్టిన యంగ్ రెబెల్ స్టార్



సాహూ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి మరొక సినిమా రాలేదు ..దీనితో ప్రభాస్ అభిమానులు కొత్త సినిమా అప్డేట్ గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు ..అయితే వాళ్ళు కోరుకున్న సమయం వచ్చేసింది ..ప్రబస్ తర్వాత మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది ..అందరు ముందే ఊహించినట్లే సినిమా పేరు రాధే శ్యామ్ ..'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో హీరోయిన్ పూజా హెగ్డే‌తో రొమాంటిక్ పోజిస్తూ కనిపించి తన అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చారు ప్రభాస్. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిన ఈ పోస్టర్ చూసి రెబల్ స్టార్ మురిసిపోతున్నారు.1960 దశకం నాటి ప్రేమకథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ.. ప్రభాస్ తల్లిగా కనిపించనుంది. సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళీ శర్మ, సాషా ఛేత్రి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై రెబల్ స్టార్ అభిమానులు భారీ అంచానాలు పెట్టుకున్నారు.భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాను కూడా ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా ప్యాన్ ఇండియా మూవీ గానే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Tags :
|
|

Advertisement