Advertisement

జులై 10 న ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ..

By: Sankar Wed, 08 July 2020 12:38 PM

జులై 10 న ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ..



యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు ..బాహుబలి వంటి అల్ టైం హిట్ సినిమాలతో ఇండియా మొత్తం పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ ..ఆ తర్వాత వచ్చిన సాహో సినిమాతో అభిమానులను కొంచెం నిరాశ పరిచాడు ..అయితే సాహో తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమా మీద బారి అంచనాలు ఉన్నాయి ..

అయితే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా గురించి ప్రభాస్ ఒక గుడ్ న్యూస్ తన అభిమానులతో పంచుకున్నాడు ..ఈ మేరకు తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు తన లేటెస్ట్ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నట్లు పేర్కొంటూ ఓ పిక్ షేర్ చేశారు ప్రభాస్. ఇది చూసి ఆనందపడుతున్న ఫ్యాన్స్ వెల్‌కమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1960 దశకం నాటి ప్రేమకథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రానికి 'ఓ డియర్' అనే పేరు పరిశీలనలో పెట్టారని టాక్.

Tags :
|
|
|

Advertisement