Advertisement

  • సోష‌ల్ మీడియాలో రికార్డుల రారాజుగా మారిన ప్ర‌భాస్

సోష‌ల్ మీడియాలో రికార్డుల రారాజుగా మారిన ప్ర‌భాస్

By: chandrasekar Sat, 18 July 2020 12:01 PM

సోష‌ల్ మీడియాలో రికార్డుల రారాజుగా మారిన ప్ర‌భాస్


సినిమాల‌తోనే కాదు సోష‌ల్ మీడియాలోను ప్ర‌భంజ‌నం సృష్టిస్తూ, రికార్డుల రారాజుగా మారాడు ప్ర‌భాస్.

మొన్న‌టి వ‌ర‌కు ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉన్న ప్ర‌భాస్ ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇన్ స్టాలో కేవలం 65 పోస్టులకే 50లక్షల ఫాలోవర్స్ చేరారు.

ఇక ఫేస్ బుక్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ప్రభాస్ పేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య 16 మిలియన్స్ కి చేరింది.

ఫేస్ బుక్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఏకైక సౌత్ స్టార్ గా ప్ర‌భాస్ పేరు చరిత్రకెక్కింది. 16 మిలియన్ల మంది ఫాలోవర్స్ క్లబ్ లోకి ప్రవేశించిన తొలి టాలీవుడ్ నటుడిగా డార్లింగ్ రికార్డులకెక్కాడు.

కేవలం 6 రోజుల్లో 1 మిలియన్ ప్ర‌భాస్‌ని ఫాలో చేశారంటే సోష‌ల్ మీడియాలో ఆయ‌న ప్ర‌భంజ‌నం ఏ విధంగా సాగుతుందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌ల ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, దీనికి దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Tags :

Advertisement