Advertisement

  • ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో విలన్ పాత్ర పోషించనున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు?

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో విలన్ పాత్ర పోషించనున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు?

By: chandrasekar Thu, 20 Aug 2020 09:28 AM

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో విలన్ పాత్ర పోషించనున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు?


ప్ర‌భాస్ 'ఆదిపురుష్' సినిమాలో విలన్ పాత్ర పోషించేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు పేరు సోషల్ మీడియా లో వేగంగా వైపతి చెందుతా వుంది. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి ప్రాజెక్టు భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేస్తున్నారు. తాజాగా తానాజీ దర్శకుడు ఓం రావ‌త్ డైరెక్ష‌న్ లో 'ఆదిపురుష్' అనే భారీ ప్రాజెక్ట్ ను ప్ర‌క‌టించాడు.

ఈ సినిమా కు సంబంధించి పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో విల‌న్ పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. గొప్ప నటుల కలయిక ఈ సినిమాకి తప్పకుండ విజయాన్ని చేకూరుస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు.

దేశ‌వ్యాప్తంగా కోట్లాదిమంది ఫాలోవ‌ర్లున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ టాలీవుడ్ ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించేది నిజ‌మే అయితే ఇండ‌స్ట్రీకి మ‌రో హిట్టు రావ‌డం ఖాయ‌మేనంటున్నారు అభిమానులు. ఇప్ప‌టికే రాధే శ్యామ్ అనే చిత్రం చేస్తున్న ప్ర‌భాస్ మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడిక‌ల్ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇందులో దీపిక ప‌దుకొణే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. బాహుబలి తరువాత ప్రభాస్ బాలీవుడ్లో ఎక్కువగా సినిమాలలో నటిస్తున్నాడు.

Tags :

Advertisement