Advertisement

  • పవర్ స్టార్ అభిమానులకు పండుగ ..వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ వచ్చేసింది

పవర్ స్టార్ అభిమానులకు పండుగ ..వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ వచ్చేసింది

By: Sankar Wed, 02 Sept 2020 09:51 AM

పవర్ స్టార్ అభిమానులకు పండుగ ..వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ వచ్చేసింది


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్. ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టే ఉదయం 9.9 గంటలకు వకీల్ సాబ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

గాంధీ, అంబేద్కర్ వంటి మహానుభావుల్ని ఈ మోషన్ పోస్టర్‌లో చూపిస్తూ.. లాయర్ గెటప్‌లో సీరియస్ లుక్‌లో దర్శనం ఇచ్చారు పవన్ కళ్యాణ్. చేతిలో క్రిమినల్ లా బుక్ పట్టుకుని చేతితో కర్ర పట్టుకుని వకీల్ సాబ్.. నేరస్థుల కీళ్లు విరిచేందుకు రెడీ అని చెప్పకనే చెప్తున్నాడు. మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో సత్యమేవ జయతే అంటూ వచ్చే ఆర్ ఆర్ మోషన్ పోస్టర్‌కి మరింత హైప్ ఇచ్చింది..

దాదాపు రెండేళ్లకు పైగా విరామం తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తుండటంతో అభిమానులు పవర్ స్టార్ ని ఎప్పుడెప్పుడు థియేటర్ లలో చూస్తామా అని ఎదురు చూస్తున్నారు..ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా నుంచి , పాటలు , ఫస్ట్ లుక్ విడుదలవగా వాటికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే..

Tags :

Advertisement