Advertisement

  • కరోనా వాక్సిన్ వచ్చేదాకా కొత్త సినిమా ప్రకటన లేదు ..పవన్ కళ్యాణ్

కరోనా వాక్సిన్ వచ్చేదాకా కొత్త సినిమా ప్రకటన లేదు ..పవన్ కళ్యాణ్

By: Sankar Sat, 25 July 2020 5:38 PM

కరోనా వాక్సిన్ వచ్చేదాకా కొత్త సినిమా ప్రకటన లేదు ..పవన్ కళ్యాణ్



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అయన అభిమానులకు పండగ లాంటింది ..అయితే రాజకీయాలకు వెళ్లిన తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తిరిగి వరుసగా సినిమాలను చేస్తున్నారు ..ప్రస్తుతం ప‌వన్ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలోని మరో చిత్రం సెట్స్ మీద ఉన్న సంగ‌తి తెలిసిందే. జనసేన పార్టీ కార్యక్రమాలను నడుపుతూనే మరో వైపు ఆ సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటూ వచ్చారు. .

కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ఆరోగ్య విపత్తుతో చిత్రసీమ స్తంభించిపోయింది. సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారి సినిమాలు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయనే చర్చ అటు ఆయన అభిమానుల్లోనూ... ఇటు చిత్ర వర్గాల్లోనూ ఉంది. జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గారు కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ గారికి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే.

Tags :

Advertisement