Advertisement

  • టాలీవుడ్ స్టార్ డాన్స్ మాస్టర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అయితున్న పవర్ స్టార్

టాలీవుడ్ స్టార్ డాన్స్ మాస్టర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అయితున్న పవర్ స్టార్

By: Sankar Mon, 30 Nov 2020 9:29 PM

టాలీవుడ్ స్టార్ డాన్స్ మాస్టర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అయితున్న పవర్ స్టార్


గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు...ప్రస్తుతం వకీల్సాబ్ షూటింగ్ జరుగుతుండగా , క్రిష్ తో మరొక మూవీ లైన్ లోపెట్టాడు ...అంతేకాకుండా కథ నచ్చితే దర్శకుడు ఎవరు అయిన పవన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు..తాజాగా డాన్స్ మాస్టర్ జానీ పవర్ స్టార్ కి కథ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తుంది...

ఆ కథ విన్న పవన్‌.. జానీ డైరెక్షన్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి..ఇక పవన్‌ కల్యాణ్‌ తన కథకు ఒకే చెప్పడంతో జానీ మాస్టర్‌ రాంచరణ్‌ను కలిసి ఈ కథ వినిపించడంతో కొణిదెల ప్రొడక్షన్‌లో ఈ సినిమాను నిర్మించేందుకు చెర్రీ కూడా ఒకే చెప్పాడంట.

అయితే చెర్రీ తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌లో కేవలం తండ్రి భారీ చిత్రాలను మాత్రమే నిర్మించిన చెర్రీ ఇప్పడు బాబాయ్‌ సినిమాను కూడా నిర్మించడానికి జానీతో జతకట్టినట్టు తెలుస్తోంది

Tags :
|

Advertisement