Advertisement

  • పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ స్టార్ట్ చేసిన అభిమానులు ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ స్టార్ట్ చేసిన అభిమానులు ..

By: Sankar Mon, 13 July 2020 5:44 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ స్టార్ట్ చేసిన అభిమానులు ..



తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఒక స్టార్‌గా ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయడానికైనా వారు సిద్ధంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న తన 49వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. మరి అప్పటికి తమ హీరో పుట్టినరోజు వేడుకలు జరుపుకోగలమో లేదో అనే అనుమానం ఫ్యాన్స్‌లో ఉంది. అందుకే, 50 రోజుల ముందుగానే సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కిక్ స్టార్ట్ చేశారు.

మాములుగా కరోనా లేకుండా ఉన్నట్లు అయితే అభిమానులు అంగరంగ వైభవంగా జరిపేవారు. అభిమాన సంఘాల ఆధ్వర్యంలో భారీ కటౌట్లు, మీటింగ్‌లు, కేక్ కటింగ్‌లు, బైక్ ర్యాలీలు, రక్తదానాలు.. ఇలా ఎన్నో జరిపేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా మహమ్మారి ఈ సరదాలన్నింటికీ తాత్కాలికంగా పుల్‌స్టాప్ పెట్టేసింది. అయినప్పటికీ ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు ..

#పిఎస్పీకే అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ ఆన్ జులై 13 హ్యాష్ ట్యాగ్‌తో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి పవన్ కళ్యాణ్ బర్త్‌డే ట్రెండ్‌ను స్టార్ట్ చేయాలని ఫ్యాన్స్ నిర్ణయించారు. అయితే, అంతకంటే ముందుగానే సోమవారం మధ్యాహ్నం నుంచే ట్రెండ్ మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ‘వకీల్ సాబ్’ మూవీ హ్యాష్‌ ట్యాగ్ ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్‌లో దూసుకెళ్తోంది. అడ్వాన్స్ బర్త్‌డే ట్రెండ్‌ను ప్రారంభించడానికి సుమారు ఐదారు గంటల ముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ఆ ట్రెండ్ ప్రారంభమైతే రికార్డుల వర్షమే.

Tags :
|

Advertisement