Advertisement

  • వర్మ మీద సెటైరికల్ మూవీకి సిద్దమైన పవర్ స్టార్ ఫాన్స్ ...

వర్మ మీద సెటైరికల్ మూవీకి సిద్దమైన పవర్ స్టార్ ఫాన్స్ ...

By: Sankar Mon, 20 July 2020 10:17 AM

వర్మ మీద సెటైరికల్ మూవీకి సిద్దమైన పవర్ స్టార్ ఫాన్స్ ...



సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే ..ఒకప్పుడు ఇండియాలోనే అగ్ర దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన వర్మ ఇపుడు కేవలం వివాదాలతోనే సహవాసం చేస్తూ కేవలం వివాదాస్పద చిత్రాలు మాత్రమే చేస్తున్నారు ..తాజాగా పవర్ స్టార్ అంటూ సినిమా ప్రకటించి ఆ సినిమా గురించి రోజుకొక పోస్టర్ వదులుతున్నాడు వర్మ ..అయితే ఆ సినిమా ఎవరిని ఉద్దేశించి తీయడం లేదు అని చెప్తున్నప్పటికీ అయన రిలీజ్ చేసే పోస్టర్లు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరిని అడిగిన చెప్తారు అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద తీస్తున్న సినిమా అని ..అందుకే పవన్ ఫాన్స్ వర్మ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం వర్మ దారిలోనే వెళ్తున్నారు ..

వర్మపై ఇప్పుడు ఒక సినిమా రాబోతోంది. అది కూడా సెటైరికల్ మూవీనే. పేరేంటో తెలుసా? ‘పరాన్న జీవి’. ‘రెక్‌లెస్ జెనిటిక్ వైరస్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా తీస్తున్నది పవన్ కళ్యాణ్ అభిమాని. 99 థియేటర్ బ్యానర్‌పై స్కై మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రానికి సీఎస్ నిర్మాత. డాక్టర్ నూతన్ నాయుడు దర్శకుడు. ఈయనెవరో కాదు ‘బిగ్ బాస్’ సీజన్ 2 కంటెస్టెంట్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను అధికారికంగా వెల్లడించనున్నారు. ‘పవర్ స్టార్’ అంటూ పవన్‌పై వ‌ర్మ సినిమా తీస్తుంటే.. ఆర్జీవీపై ప‌వ‌న్ అభిమాని ఓ సినిమా తీయ‌డం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

దీనితో ‘పరాన్న జీవి’పై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి మద్దతు లభిస్తోంది. ‘పవర్ స్టార్’ సినిమాను ఈనెల 25న ఆర్జీవీ వరల్డ్ థియేటర్ వెబ్‌సైట్‌లో వర్మ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు దీనికి పోటీగా ‘పరాన్న జీవి’ని సిద్ధం చేస్తున్నారు. అదే తేదీన ఈ సినిమానూ విడుదల చేస్తున్నారు. అంతేకాదు, ‘పవర్ స్టార్’ ట్రైలర్ వస్తోన్న ఈనెల 22వ తేదీనే ‘పరాన్న జీవి’ ట్రైలర్ కూడా రాబోతోంది.

Tags :
|
|
|

Advertisement