Advertisement

  • పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ ..పవన్ ఫాన్స్ కు విజయ దశమి ట్రీట్

పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ ..పవన్ ఫాన్స్ కు విజయ దశమి ట్రీట్

By: Sankar Sun, 25 Oct 2020 1:55 PM

పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ ..పవన్ ఫాన్స్ కు విజయ దశమి ట్రీట్


టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు ..క్రేజ్ పీక్స్ లో ఉన్న టైంలోనే సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ , అభిమానుల కోరిక మేరకు మల్లి సినిమాలు చేస్తాను అని ఎప్పుడితే ప్రకటించాడో అప్పటినుండి నిర్మాతలు పవన్ తో సినిమా కోసం వరుస కట్టారు ..దీనితో వరుసగా పవన్ కళ్యాణ్ సినిమాలు సంబందించిన న్యూస్ తో పవన్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు...

ఇప్పటికే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ షూటింగ్ 80శాతానికి పైగా పూర్తి చేసుకుంది. పవన్ ను స్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాను ఓకే చేసాడు పవన్ . వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తి కాగానే క్రిష్ తో మూవీని కూడా పూర్తి చేసేందుకు షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు. ఈలోగానే హరీష్ శంకర్.. సాగర్ చంద్ర .. త్రివిక్రమ్ పవన్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధిన అప్డేట్స్ ను అనౌన్స్ చేశారు .

ఈ నేపథ్యంలో నేడు విజయదశమి సందర్భమాగ్ మరో అప్డేట్ ఏదైనా వస్తుందేమో అని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అభిమానులకోసం అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ విడుదల చేసింది. పవన్ కల్యాణ్ కింగ్ ఆఫ్ యాటిట్యూడ్ ని ఎలివేట్ చేసేలా ఓ వీడియోను డిజైన్ చేసారు. ఈ వీడియోలో లో ఎస్.ఎస్.థమన్ థీమ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. పీడీఎస్ ప్రసాద్ సమర్పణలో సితార సంస్థ ప్రొడక్షన్ నం.12 గా ఈ మూవీని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది.సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై తాజా అప్డేట్ తో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Tags :

Advertisement