Advertisement

  • మెగాస్టార్ చిరంజీవితో ఆ డైరెక్టర్ సినిమా .. కన్ఫామ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవితో ఆ డైరెక్టర్ సినిమా .. కన్ఫామ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

By: Sankar Thu, 03 Sept 2020 3:32 PM

మెగాస్టార్ చిరంజీవితో ఆ డైరెక్టర్ సినిమా .. కన్ఫామ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్ మీదున్నారు. చిరు ‘ఖైదీ నెం 150’తో రీఎంట్రీ ఇచ్చి సైరా తో మెగాహిట్ అందుకున్నాడు. ఈ సినిమాను యువ దర్శకుడు సురేందర్ రెడ్డికి తెరకెక్కించాడు. ఇక ప్రస్తుతం స్టార్ దర్శకుడు కొరటాల శివతో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడింది.

ఆ తర్వాత మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా బాధ్యతలు సాహో దర్శకుడు సుజిత్ కు అప్పగించాడు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు అని చాలారోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు దానిని చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్ఫామ్ చేసాడు.

నిన్న పవన్ పుట్టిన రోజు సందర్బంగా రమేష్ ట్విట్టర్ లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ పోస్ట్ పై పవర్ స్టార్ స్పందిస్తూ... ధన్యవాదాలు రమేష్ . చిరంజీవితో మీరు తీయబోయే సినిమాకు ఆల్ ది బెస్ట్'' అని తెలిపాడు. ఈ పోస్ట్ తో మెహర్ రమేష్-చిరంజీవి కలయికలో సినిమా వస్తుది అనేది కన్ఫామ్ అయ్యింది..

ఇక మెహెర్ రమేష్ విషయానికి వస్తే కంత్రి , బిల్లా , షాడో వంటి సినిమాలు తీసాడు..అయితే ఆ సినిమాలు అంతగా ఆడకపోయినప్పటికీ మెహెర్ రమేష్ టేకింగ్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి..అయితే ఇటీవల కాలంలో సినిమాలకు కొంచెం దూరంగా ఉన్న మెహెర్ ఇపుడు చిరంజీవి లాంటి మెగాస్టార్ తో సినిమాను కంఫర్మ్ చేసుకోవడం చూస్తే ఈ సారి గట్టిగానే విజయం కొడతాడు అనిపిస్తుంది..

Tags :

Advertisement