Advertisement

  • చిరంజీవి కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఎవరో కూడా తెలుసు - పోసాని

చిరంజీవి కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఎవరో కూడా తెలుసు - పోసాని

By: Anji Mon, 21 Sept 2020 10:39 AM

చిరంజీవి కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఎవరో కూడా తెలుసు - పోసాని

టాలీవుడ్ యాక్టరు పోసాని కృష్ణమురళి మెగా స్టార్ చిరంజీవి గురించి ఎవరికీ తెలియని నిజాన్ని బయటపెట్టారు. అదేమిటంటే... రాజకీయ నాయకుడిగా చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఏంటో తనకు తెలుసంటున్నారు పోసాని కృష్ణమురళి. అంతేకాదు.. చిరంజీవి అలా కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఎవరో కూడా తనకు తెలిసంటున్నారు. చిరంజీవిని రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో తెలియక.. చంద్రబాబు, చిరంజీవి కుటుంబాన్ని తిట్టించాడని.. ఊహించని విధంగా తన కుటుంబాన్ని రోడ్డుకు లాగడంతో చిరంజీవి చలించిపోయారని పోసాని వివరించారు.

"చంద్రబాబు ఓ లేడీ పొలిటీషిన్ తో చిరంజీవి ఇంట్లో లేడీస్ గురించి బ్యాడ్ గా మాట్లాడించాడు. చిరంజీవి ఇంట్లో పిల్లల్నే కంట్రోల్ చేయలేడు, ప్రజల్ని ఏం కంట్రోల్ చేస్తాడంటూ రచ్చ చేయించాడు. చాలా ఇళ్లల్లో అమ్మాయిలు-అబ్బాయిలు ప్రేమించుకుంటారు. సెట్ అవ్వకపోతే విడాకులు తీసుకుంటారు. చాలా ఇళ్లల్లో జరిగే వ్యవహారం ఇది. అంతెందుకు.. ఎన్టీఆర్ కుటుంబంలో జరగలేదా? కేవలం చిరంజీవి ఇంట్లోనే వేలు పెట్టి చూపించారు.

తండ్రిగా చిరంజీవి ఎంత క్షోభ పడి ఉంటారో నాకు తెలుసు. 2 నెలల పాటు చిరంజీవి ఏమీ మాట్లాడలేదు. తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు." ఇలా చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాన్ని పోసాని బయటపెట్టారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి పెద్ద నాయకుడు తన కుటుంబం జోలికి వస్తాడని చిరంజీవి కలలో కూడా అనుకోలేదట. అప్పుడు స్వయంగా పోసాని రంగంలోకి దిగి, చిరంజీవి కుటుంబంపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల నోళ్లు మూయించారు.

ఆ ఘటన నుంచి చంద్రబాబు అంటే తనకు అసహ్యమేసిందని చెప్పుకొచ్చారు పోసాని. ఇక జగన్ కు ఇండస్ట్రీ దూరమైందంటూ జరిగుతున్న ప్రచారాన్ని పోసాని తిప్పికొట్టారు. తెలుగు ఇండస్ట్రీలో 24 క్రాఫ్టుల్లో ఎక్కువమంది జగన్ ను ప్రేమించేవారు ఉన్నారని.. లైట్ బాయ్ నుంచి జూనియర్ ఆర్టిస్టు, అసిస్టెంట్ డైరక్టర్ వరకు చాలామంది ఉన్నారని అన్నారు.. కొంతమందిలా వీళ్లు ఫైళ్లు పట్టుకొని బెజవాడ వెళ్లరని... మనసులో జగన్ ను ప్రేమిస్తుంటారని తెలిపారు..

ఇక తనకు ఎలాంటి రాజకీయ పదవులు వద్దని మరోసారి స్పష్టంచేసిన పోసాని.. ఆంధ్రప్రదేశ్ లో టాలీవుడ్ అభివృద్ధి కోసం స్టుడియో నిర్మించాలనే ఆలోచనను బయటపెట్టారు. స్టుడియో కోసం ల్యాండ్ అడిగే అన్ని అర్హతలు తనకు ఉన్నాయని.. అయితే ప్రస్తుతానికి ఇంకా తన స్టుడియో ఆలోచనలు కార్యరూపంలోకి రాలేదంటున్నారు పోసాని.

Tags :

Advertisement