Advertisement

  • వర్మ పవర్ స్టార్ సినిమాపై ట్విట్టర్లో సెటైర్లు వేసిన పూనమ్ కౌర్

వర్మ పవర్ స్టార్ సినిమాపై ట్విట్టర్లో సెటైర్లు వేసిన పూనమ్ కౌర్

By: Sankar Sun, 28 June 2020 5:54 PM

వర్మ పవర్ స్టార్ సినిమాపై ట్విట్టర్లో సెటైర్లు వేసిన పూనమ్ కౌర్



వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ టాలీవుడ్ పవర్ స్టార్ , జనసేనాని పవన్ కళ్యాణ్ మీద సినిమా తీస్తున్నట్లు ప్రకటించగానే ఇండస్ట్రీలో చాలా మంది ఆశ్చర్యానికి గురి అయ్యారు ..మొన్నటి వరకు మెగా ఫామిలీ మీద కోపం ఉన్నట్లు ఉన్న వర్మ , తాజాగా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ వ్యాఖ్యలు చేయడం అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మీద సినిమాను ప్రకటించడంతో వర్మ మైండ్ అర్థంకాక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు ..అయితే పవన్ కళ్యాణ్ మీద సినిమాను అనౌన్స్ చేయగానే నటి పూనమ్ కౌర్ వెంటనే రియాక్ట్ అయింది ..

వ‌ర్మ తాజాగా ‘ప‌వ‌ర్‌స్టార్‌’ అనే సినిమాను చేయ‌బోతున్నాన‌ని అనౌన్స్ చేశారు. అందులో న‌టించే వారి పేర్ల‌తో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ లుక్‌ను పోలిన ఓ వీడియో విడుద‌ల చేశారు వ‌ర్మ‌. అయితే వర్మ ట్వీట్‌కు న‌టి పూన‌మ్ కౌర్ ట్విట్ట‌ర్ ద్వారా ఘాటుగా బదులిచ్చారు. ‘‘‘పవర్‌స్టార్’ సినిమాలో ఆర్జీవీ అనే క్యారెక్ట‌ర్‌ను కూడా యాడ్ చేయండి.

అమ్మాయిల బ‌ల‌హీన‌త‌లు తెలుసుకుని వారిని ప్రేరేపించి వారికి ఇత‌రుల‌ను కించ‌ప‌రిచేలా ట్వీట్స్ పంపి వాటిని షేర్ చేయ‌మ‌ని చెప్పి, త‌ర్వాత దాని గురించి మీడియాకు చెప్ప‌మ‌ని చెబుతారు. నేను చిన్న‌తనంలో మిమ్మ‌ల్ని ఎంత‌గానో గౌర‌వించేదాన్ని..ఇప్పుడు మిమ్మ‌ల్ని చూసి బాధ‌ప‌డుతున్నాను’’ అని అన్నారు పూన‌మ్ కౌర్‌.

Tags :

Advertisement