Advertisement

ఆమె చేతిలో అరడజను సినిమాలు

By: Anji Wed, 16 Sept 2020 4:36 PM

ఆమె చేతిలో అరడజను సినిమాలు

ముకుందా సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజ కి మొదట్లో అంతగా కలిసి రాలేదు.. దాంతో బాలీవుడ్ కి వెళ్లిన పూజ ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్రనాయికగా కొనసాగుతున్న హీరోయిన్ ఎవరంటే పూజ హెగ్డే అని చెప్పొచ్చు.. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి.

ఆ సినిమాలు అన్ని స్టార్ హీరో సినిమాలు కాగా ఆ సినిమాల్లో రాధే శ్యామ్ సినిమా ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. పూజ రాధే శ్యామ్ తో పాటు అఖిల్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు, మూడు సినిమాలకు కూడా పూజ ఓకే చెప్పిందని తెలుస్తుంది.. అయితే గత కొంత కాలంగా సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడడంతో ఆమె లాక్ డౌన్ లో ఖాళీగా ఉంటూ వచ్చింది.

అయితే ఇటీవలే అఖిల్ సినిమా కోసం ఆమె హైదరాబాద్ వచ్చిందట.. ఆ సినిమా తో పాటే ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ను కూడా పూర్తి చేయనుందట.. ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉండడంతో ఆమె ఈ సినిమాలు పూర్తి చేసిన తర్వాతే మిగితా సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యిందట.. ఈ సినిమాలు పూర్తి చేసి చేయంగానే మొదలు కావాల్సిన సినిమాలు మొదలు పెట్టి మరో రెండు మూడు నెలల్లో ఆ సినిమాలు కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి వెళ్లాలని ఆలోచిస్తుందట.

ఇలా గ్యాప్ ని వరుస సినిమాలు చేస్తూ ఆ గ్యాప్ ని పూడ్చడమే కాకుండా యంగ్ హీరోలతో నూ నటిస్తూ ఇతర హీరోయిన్ లను తనకు పోటీ లేకుండా చేసుకుంటుంది.. రష్మిక, నభ నటేష్ లాంటి హీరోయిన్ అవకాశాలకు ఆమె గండి కొడుతుందని వాదన ఫిలిం నగర్ లో ఇప్పుడు వినిపిస్తుంది.

Tags :

Advertisement