Advertisement

  • మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే మరియు రష్మిక మందన్న?

మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే మరియు రష్మిక మందన్న?

By: chandrasekar Wed, 02 Dec 2020 09:42 AM

మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే మరియు రష్మిక మందన్న?


టాలీవుడ్ లో ఇప్పుడు మంచి క్రెజ్ మీద వున్న హీరోయిన్లు గా పూజా హెగ్డే మరియు రష్మిక మందన్న గా చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న క్రేజ్, మార్కెట్ ప్రకారం లెక్కలేసుకుంటే నెంబర్ వన్ హీరోయిన్ పూజా హెగ్డే మరియు ఆమె తర్వాత స్థానంలో ఉన్నది రష్మిక మందన్న. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రస్తుతం వరస సినిమాలతో క్యూ కట్టిస్తున్నారు. పూజా అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో పాటు బాలీవుడ్ ఆఫర్స్ కూడా అందుకుంటుంది. మరోవైపు రష్మిక కూడా తక్కువేం కాదు. ఈమె కూడా తెలుగులో ఈ ఏడాది ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి హిట్స్ ఇచ్చింది. ఇప్పుడు బన్నీతో పుష్ప శర్వానంద్ తో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలతో పాటు తమిళంలో కార్తితో సుల్తాన్, కన్నడలో ధృవ సర్జతో పొగరు సినిమాల్లో నటిస్తుంది.

ప్రస్తుతం వీరిద్దరూ ప్రముఖ హీరోలతో ఎవరి దారిలో వాళ్లు బిజీగా నటిస్తున్నారు. మరో ముద్దుగుమ్మకు ఛాన్స్ ఇవ్వకుండా అవకాశాలు అన్నీ లాగేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఆ ఊహను నిజం చేస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. పడిపడి లేచే మనసు డిజాస్టర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో సినిమాతో హను వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన మమ్ముట్టి తనయుడు, సెన్సేషనల్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. హను రాఘవపూడి ఈ సినిమాని తెలుగు, తమిళం, మలయాళంలో తెరకెక్కిస్తున్నాడు.

దుల్కర్ సల్మాన్ హీరోగా భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో సైనికుడిగా దుల్కర్ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, రష్మిక మందన్నలను తీసుకోవాలని చూస్తున్నాడు హను. ఇప్పటికే కథ చెప్పి ఒప్పించడమే కాకుండా ఒప్పందాలు కూడా పూర్తి చేసాడని తెలుస్తుంది. ఇప్పుడు దాదాపు 40 కోట్లతో ఈ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా కూడా ఒకే సినిమాలో ఇద్దరు టాప్ హీరోయిన్లను తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో ఈ స్థాయి బడ్జెట్ పెట్టడం కూడా చిన్న విషయం కాదు. కానీ ఈ సినిమాలో సెన్సేషనల్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. ఈయనకు ఉన్న ఫాలోయింగ్ కారణంగానే ఇద్దరు బ్యూటీస్ నటించడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇద్దరు హీరోయిన్ కారణంగా మంచి విజయాన్నే అందుకుంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Tags :
|

Advertisement