Advertisement

  • షూటింగ్ కు అనుమతి తీసుకోకపోవడంతో యువ నటుడి సినిమా పై కేసు

షూటింగ్ కు అనుమతి తీసుకోకపోవడంతో యువ నటుడి సినిమా పై కేసు

By: Sankar Fri, 16 Oct 2020 10:28 PM

షూటింగ్ కు అనుమతి తీసుకోకపోవడంతో యువ నటుడి సినిమా పై కేసు


కరోనా లాక్ డౌన్ తరువాత ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్ లు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇచ్చిన కొన్ని సినిమాలు మాత్రమే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ లు చేస్తున్నారు. కొన్ని సినిమాల షూటింగ్ లు ఇంకా ప్రారంభం కాలేదు.

గతంలో పబ్లిక్ ప్లేస్ లో అనుమతులు తీసుకొని షూటింగ్ లు చేసుకునే అవకాశం ఉండేది. కరోనా కారణంగా, ఇప్పుడు షూటింగ్ లు స్టూడియోలలో మాత్రమే జరుగుతున్నాయి. ఒకవేళ పబ్లిక్ ప్లేస్ లలో షూటింగ్ చేయాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిందే. అయితే, టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమా షూటింగ్ ఉప్పల్ లోని బ్యాంకు కాలనీలోని ఓ పబ్లిక్ ప్లేస్ లో జరుగుతున్నది.

అయితే, ఉప్పల్ లోని బ్యాంకు కాలనీలో షూటింగ్ చేసేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. షూటింగ్ లకు అనుమతులు తీసుకోకపోవడంతో వనమాలి క్రియేషన్స్ ప్రొడక్షన్ మేనేజర్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags :
|
|
|

Advertisement