Advertisement

  • జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్‌పై కేసు నమోదు...!

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్‌పై కేసు నమోదు...!

By: Anji Mon, 07 Dec 2020 10:56 PM

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్‌పై కేసు నమోదు...!

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పై గూడూరు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ మరియు దాడి కేసు నమోదైంది. మహబూబాబాద్ జిల్లా భూపతిపేటలో తన సోదరి భర్త మీద కార్తీక్ స్నేహితులతో కలిసి దాడిచేసినట్టు చేబుతున్నారు.

తన బావ మరిది కార్తీక్ వెంట ఐదుగురు ప్రైవేటు వ్యక్తులు వచ్చి దాడి చేసినట్లు పోలీసులకు బాధితుడు రవికుమార్ ఫిర్యాదు చేశారు. తనను కిడ్నాప్ చేసి, సుమారు పదిహేను కిలో మీటర్లు దూరం కారు తీసుకెళ్ళి కొట్టించాడని రవికుమార్ ఫిర్యాదు ఫిర్యాదు చేశాడు.

కార్తీక్ తో పాటు అతని తల్లిదండ్రులు, వెంట వచ్చిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్ నాయక్ పేర్కొన్నారు.

Tags :

Advertisement