Advertisement

  • ఐటెం సాంగ్స్ వార్తలు అన్ని రూమర్స్ మాత్రమే ..పాయల్ రాజ్‌పుత్‌

ఐటెం సాంగ్స్ వార్తలు అన్ని రూమర్స్ మాత్రమే ..పాయల్ రాజ్‌పుత్‌

By: Sankar Sun, 05 July 2020 7:45 PM

ఐటెం సాంగ్స్ వార్తలు అన్ని రూమర్స్ మాత్రమే ..పాయల్ రాజ్‌పుత్‌



ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌పై గత వారం రోజులుగా వస్తున్న వార్తల గురించి తెలియంది కాదు. ముందు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ‘పుష్ప’లో ఆమె ఐటమ్ సాంగ్ చేస్తుందంటూ వార్తలు వినిపించాయి. ఆ తర్వాత శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్ 2’లో కూడా ఆమె ఐటం సాంగ్ చేస్తుందంటూ కాస్త గట్టిగానే అంటే దాదాపు ఫిక్సయింది అన్నట్లుగా వార్తలు. అసలే సరైన సినిమా చేతిలో లేక ఇబ్బంది పడుతున్న పాయల్ రాజ్‌పుత్, ఈ రెండు సినిమాలలోని ఐటం సాంగ్స్‌తో టాప్ లెవల్‌కి వెళుతుందని అంతా అనుకుంటున్న టైమ్‌లో.. అసలు ఈ వార్తలలో నిజం లేదని పాయల్ క్లారిటీ ఇచ్చేసింది. అసలు నాకిప్పుడు ఐటమ్ సాంగ్స్ చేసే ఆలోచనే లేదని ఆమె తెలిపింది.

దయచేసి ఫేక్ న్యూస్ వ్యాపింపజేయకండి. అసలు ఈ రూమర్లు ఎవరో పుట్టిస్తున్నారో నాకు తెలియడం లేదు. నేనైతే ఏ చిత్రంలో సాంగ్స్ చేయడానికి అంగీకరించలేదు. సాంగ్స్ చేయాలంటూ నన్నెవరూ అప్రోచ్ అవ్వడం జరగలేదు. ఇండియన్ 2, పుష్ప వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారంటగా అని కొన్ని రోజులుగా నాకు ఒకటే మెసేజ్‌లు వస్తున్నాయి.

ఈ సందర్భంగా అలా వినిపిస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని తెలియజేస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఏ చిత్రానికి, సాంగ్‌కి సైన్ చేయలేదు. అలాగే ఇప్పట్లో షూటింగ్‌లో పాల్గొనే అవకాశం కూడా లేదు. చిల్ అండ్ రిలాక్స్. ఇక నా అభిమానుల కోసం నేను చెప్పేది ఏమిటంటే.. ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న కథలను వింటున్నాను. నేను ఏదైనా సినిమా అంగీకరించగానే అందరికీ తెలియజేస్తాను.. ’’ అని పాయల్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో తెలియజేసింది.

Tags :

Advertisement