Advertisement

  • పవన్ కళ్యాణ్ బర్త్ డే కు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ పాయల్ రాజపుత్

పవన్ కళ్యాణ్ బర్త్ డే కు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ పాయల్ రాజపుత్

By: Sankar Thu, 03 Sept 2020 11:12 AM

పవన్ కళ్యాణ్ బర్త్ డే కు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ పాయల్ రాజపుత్


నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా చాలామంది సినీ స్టార్స్ ఆయనకు విషెస్ తెలిపారు. అయితే హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్ మాత్రం ఆయనకు ఓ గిఫ్ట్ కూడా ఇచ్చింది.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. ఇందులో స్వచ్చందంగా పాల్గొన పాయల్ నిన్న మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడం అంటే నాకు చాలా ఇష్టం, రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చూసి నేను స్వచ్చందంగా దీనిని స్వీకరించి ఈరోజు మొక్కలు నాటాను అని పాయల్ తెలిపింది.

ఈ సందర్భంగా హీరోలు రవితేజ, సౌరబ్, అలాగే కరణ్ శర్మ, హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నట్లు తెలిపి వారు దీనిని స్వీకరించి మొక్కలు నాటాలని పాయల్ పిలుపునిచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నేను దీనిని ఆయనకు అంకితం ఇస్తున్నాను అని పాయల్ తెలిపింది.

Tags :

Advertisement