Advertisement

  • మరొక స్టార్ దర్శకుడితో పవర్ స్టార్ సినిమా ..?

మరొక స్టార్ దర్శకుడితో పవర్ స్టార్ సినిమా ..?

By: Sankar Thu, 13 Aug 2020 11:57 AM

మరొక స్టార్ దర్శకుడితో పవర్ స్టార్ సినిమా ..?



తెలుగు లో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న నటులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు .ఎన్ని అపజయాలు వచ్చిన చెక్కు చెదరని స్టామినా ఆయనది..అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవర్ స్టార్ సినిమాలకు దూరం అయ్యాడు ..

అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలు కొంచెం దూరం అయిన పవర్ స్టార్ , మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్నారు..ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు దగరలో ఉండగా , క్రిష్ దర్శకత్వంలో మరొకసారి సినిమాను లైన్ లో పెట్టాడు .దీనితో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు ..

ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మరొక వార్త వెలువడుతుంది ..పవన్‌ తన నెక్ట్స్‌ ప్రాజెక్టును దర్శకుడు సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో చేయనున్నారని సమాచారం. ఈ సినిమాను ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. సెప్టెంబర్‌ 2వ తేదీన పవర్‌ స్టార్‌ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు కంటే ముందు సెప్టెంబర్‌ 1న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. ‘సైరా నర్సింహరెడ్డి’తో హిట్‌ అందుకున్న సురేందర్‌ రెడ్డి ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దనున్నారో వేచి చూడాలి.

Tags :
|
|

Advertisement