Advertisement

  • లీకుల బెడదకు గురి అయిన పవర్ స్టార్ వకీల్ సాబ్ మూవీ ...

లీకుల బెడదకు గురి అయిన పవర్ స్టార్ వకీల్ సాబ్ మూవీ ...

By: Sankar Mon, 29 June 2020 1:57 PM

లీకుల బెడదకు గురి అయిన పవర్ స్టార్ వకీల్ సాబ్ మూవీ  ...



ఇటీవల కాలంలో సినిమా ఇండస్ర్టీ ని లీకులు బాగా ఇబ్బంది పెడ్తున్నాయి ..ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతలు ఎన్నో కష్టాలు పడి సినిమాలను పూర్తి చేస్తుంటే , లీకు వీరులు మాత్రం ఇవేమి పట్టవు అన్నట్లు సినిమాలోని ఫోటో లను లేదా వీడియోలను లీక్ చేస్తున్నారు ..పెద్ద హీరోల సినిమాలకు ఇది ఇంకా ఎక్కువగా ఉంది ..తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్సాబ్ మూవీ లో ఒక ముఖ్యమైన కోర్ట్ సీన్ లో పవన్ కళ్యాణ్ స్టిల్ లీక్ అయింది ..దీనితో దర్శక నిర్మాతలు షాక్ అయ్యారు ..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీ ఎంట్రీ మూవీ గా వస్తున్నవ‌కీల్‌సాబ్‌ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’కు ఇది రీమేక్‌. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కుడు. అంజ‌లి, నివేదా థామ‌స్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా ప్ర‌భావంతో ఆగింది. ప‌రిస్థితులు చూస్తుంటే ఆగ‌స్ట్‌లో సినిమా షూటింగ్ మొద‌ల‌య్యేలానే క‌న‌ప‌డుతుంది ..

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది ..దాదాపు మూడు ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో పవన్ అభిమానుల్లోనే గాక ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ..

Tags :
|
|

Advertisement