Advertisement

రాజకీయ నేతగా పవన్‌ కళ్యాణ్...!

By: Anji Sat, 19 Dec 2020 8:52 PM

రాజకీయ నేతగా పవన్‌ కళ్యాణ్...!

ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగుతో బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్ ఆ తర్వాత రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.

ఇందులో సురేందర్‌ రెడ్డితో సినిమా ఒకటి. మెగాస్టార్‌తో ‘సైరా’ వంటి భారీ సినిమా తెరకెక్కించిన సురేందర్‌... పవన్‌తో సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి బయటికొచ్చింది.

పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్ రాజకీయ నేతగా కనిపించనున్నారట. అంతేకాదు ఆయన పాత్ర నెగిటివ్ షేడ్స్‌తో సాగుతుందట.

ఓ వైపు ఎంటర్‌టైనింగ్ చేస్తూనే మరోవైపు నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో పవన్ అభిమానులను అలరించనున్నారట. దీనిపై సురేందర్ రెడ్డి అండ్ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

సురేందర్ రెడ్డి ప్రస్తుతం అక్కినేని అఖిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత పవన్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Advertisement