Advertisement

వకీల్ సాబ్ రిలీజ్ వచ్చే సంక్రాంతికేనా ..?

By: Sankar Thu, 25 June 2020 9:13 PM

వకీల్ సాబ్ రిలీజ్ వచ్చే సంక్రాంతికేనా ..?



రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకుని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ చేస్తున్న చిత్రం `వకీల్ సాబ్`. డైరెక్టర్ వేణు శ్రీరామ్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు అయిపోయింది. కొద్ది భాగం మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ ఈ సినిమా విడుదల విషయంలో పవన్, దిల్ రాజు తొందరపడడం లేదట..ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు పాటకు అద్భుత రెస్పాన్స్ వచ్చింది ..దీనితో ఈ సినిమా మీద అనేక అంచనాలు ఉన్నాయి ..

అయితే సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు అనుకుంటున్నారట. వచ్చే సంక్రాంతి సమయానికి పెద్ద హీరోల సినిమాలేవీ విడుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి తమ సినిమాను సంక్రాంతి బరిలో ఉంచాలని దిల్ రాజు అనుకుంటున్నారట. అందువల్ల దసరాకు షూటింగ్ ప్రారంభించినా డిసెంబర్ నాటికి పూర్తయిపోతుందని భావిస్తున్నారట. అందుకే కరోనా బాగా కంట్రోల్ అయ్యేవరకు సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లకూడదనుకుంటున్నారట.

Tags :

Advertisement