Advertisement

  • పవర్ స్టార్ సినిమాలో వర్మ పవన్ కళ్యాణ్ ని పొగిడాడా , తిట్టాడా ..అర్థంకాని అభిమానులు

పవర్ స్టార్ సినిమాలో వర్మ పవన్ కళ్యాణ్ ని పొగిడాడా , తిట్టాడా ..అర్థంకాని అభిమానులు

By: Sankar Sun, 26 July 2020 09:42 AM

పవర్ స్టార్ సినిమాలో వర్మ పవన్ కళ్యాణ్ ని పొగిడాడా , తిట్టాడా ..అర్థంకాని అభిమానులు


సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ..ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ విన్న ఈ పేరే ..లాక్ డౌన్ కారణంగా మిగిలిన దర్శక నిర్మాతలు అందరు అన్ని వాయిదా వేసుకొని ఇంట్లోనే ఉంటే వర్మ మాత్రం ఒక రేంజ్ లో డబ్బులు సంపాదిస్తున్నాడు ..అయితే వర్మ డబ్బులు మాత్రమే కాకుండా వివాదాలను కూడా బానే సంపాదిస్తున్నాడు ..తాజాగా వర్మ తీసిన పవర్ స్టార్ సినిమా ఓటిటిలో విడుదల అయింది ...ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయం జీవితం మీద వ్యంగ్యాస్త్రం అని చెప్పుకుంటున్నా ఈ సినిమా విడుదల తర్వాత మాత్రం అందరికి షాక్ ఇచ్చింది ..

ఈ సినీమా చుసిన చాల మంది ముఖ్యంగా పవర్ స్టార్ ఫాన్స్ ..వర్మ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను తిట్టారా , పొగిడారా అన్నది అర్థంకాక అయోమయంలో పడ్డారు ..అయితే విడుదలకు ముందు ఎన్ని తిట్లు అయితే వర్మ ని పవన్ ఫాన్స్ తిట్టారో సినిమా రిలీజ్ తర్వాత మాత్రం వర్మని పొగుడుతున్నారు ..ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ 'పవర్ స్టార్' సినిమాపై పవన్ ఫ్యాన్స్ రివ్యూ అని పేర్కొంటూ రిలీజ్ తర్వాత కూడా తన సినిమాను మరోసారి చర్చల్లో నిలిచేలా చేశారు వర్మ.

ఇక ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు.. 'పవర్ స్టార్' సినిమాపై ప్రశంసలు గుప్పించడం చూడొచ్చు. సినిమా స్టార్ట్ అయ్యాక మొదటి 25 నిమిషాలు ఆర్జీవీని బండ బూతులు తిట్టుకున్న మేము.. చివరి 10 నిముషాలు చూసి పవన్ కళ్యాణ్ నిజమైన ఫ్యాన్ అంటే ఆర్జీవీ అని ఫిక్సయ్యామంటూ వాళ్ళు చెప్పడం గమనించవచ్చు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు నిజమే అంటుంటే, ఇంకొందరు ఇలాంటివి అస్సలు నమ్మొద్దు.. ఇవన్నీ వర్మ జిమ్మిక్కులే అంటూ కామెంట్ చేస్తున్నారు.

Tags :
|

Advertisement