Advertisement

  • సూపర్ స్టార్ మహేష్ దంపతులకు క్రిస్మస్ గిఫ్ట్ పంపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

సూపర్ స్టార్ మహేష్ దంపతులకు క్రిస్మస్ గిఫ్ట్ పంపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

By: Sankar Thu, 24 Dec 2020 11:06 AM

సూపర్ స్టార్ మహేష్ దంపతులకు క్రిస్మస్ గిఫ్ట్ పంపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్


తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న హీరోలలో టాప్ హీరోలు అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ ల మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే...బయట ఫ్యాన్స్ ఎన్ని గొడవలు పెట్టుకున్న ఈ ఇద్దరు హీరోలు మాత్రం సమయం వచ్చినప్పుడల్లా తమ స్నేహాన్ని చాటుకొని అభిమానులకు సందేశాన్ని అందిస్తుంటారు...తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఈ ఇద్దరు హీరోల అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు...

ప్రపంచం మొత్తం డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ఒకరికి ఒకరు గిఫ్ట్స్‌ ఇచ్చి తమ ప్రేమను తెలియజేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పవర్‌ స్టార్‌, అన్నా లెజినోవా దంపతులు సూపర్‌ స్టార్‌ మహేష్‌ ఫ్యామిలీకి క్రిస్మస్‌ గిఫ్ట్ పంపారు.

ఈ విషయాన్ని నమ్రత శిరోద్కర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొంది. అంతేగాక పవన్‌ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసింది నమ్రత. పవన్‌ తరచుగా తన తోటలోని మామిడి పండ్లని గిఫ్ట్‌గా పంపిస్తుంటారు. ఈ సారి మహేష్ ఫ్యామిలీకి క్రిస్మస్‌ గిఫ్ట్‌ పంపడంతో ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

Tags :

Advertisement