Advertisement

  • భారీ బడ్జెట్ దాదాపు 170 కోట్లతో ఓటీటీ సినిమా నిర్మాణం

భారీ బడ్జెట్ దాదాపు 170 కోట్లతో ఓటీటీ సినిమా నిర్మాణం

By: chandrasekar Fri, 14 Aug 2020 7:08 PM

భారీ బడ్జెట్ దాదాపు 170 కోట్లతో ఓటీటీ సినిమా నిర్మాణం


భారీ బడ్జెట్ దాదాపు 170 కోట్లతో ఓటీటీ సినిమా నిర్మాణం చేపట్ట నున్నట్లు అల్లు అరవవింద్ వెల్లడించారు.టాలీవుడ్‌లోని అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రొడ్యూసర్స్‌లో అల్లు అరవింద్ ఒకరు. ఆయన చేతిలో ఓ ప్రాజెక్డ్ పడినా, ఓ స్క్రిప్ట్‌కు ఓకే చెప్పినా అది మినిమమ్ గ్యారెంటీ అన్న టాక్ ఉంది. అందుకే టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ మూడు దశాబ్దాలకు పైగా సక్సెస్ అవుతున్నాడు. అయితే రాబోయే తరాన్ని, కాలాన్ని ముందే ఆలోచించి ఆహా వంటి యాప్‌ను కూడా లాంచ్ చేసి ముందుచూపున్న నిర్మాతగా మరోసారి నిరూపించుకున్నాడు.

ప్రస్తుతమున్న కరోనా, లాక్ డౌన్ వంటి పరిస్థితులు ఎదురవుతాయని ముందే ఊహించారో ఏమో గానీ సొంత ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై కన్నేశాడు అల్లు అరవింద్. రాబోయే కాలం అంతా ఓటీటీ అని గ్రహించాడో ఏమోగానీ ఆహాను ప్రారంభించేశాడు. మెల్లిమెల్లిగా చిత్రాలను సేకరించారు. అయితే ఈ లాక్ డౌన్ కాలంలో మాత్రం ఆహా బాగానే క్లిక్కయింది.

అన్ని సినిమా హాళ్లు మూసేయడంతో దాదాపు నాలుగు నెలల లాక్ డౌన్ కాలంలో ఓటీటీ సంస్థలే దిక్కయ్యాయి. అందులో భాగంగా తెలుగులో అంతో ఇంతో ఫేమస్ అయిన ఆహాకు మరింత ఆదరణ లభించింది. ఆహాలో వచ్చిన చిత్రాలు, వెబ్ సీరీస్‌లు ఫుల్ సక్సెస్ అయ్యాయి. కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతి రామకృష్ణ వంటి చిత్రాలు బాగా వైరల్ అయ్యాయి. సినిమాలు బాగుంటే ప్రేక్షకులు తప్పకుండ ఆదరిస్తారని తెలిపారు.

కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంవల్ల ప్రస్తుతం సినిమా థియేటర్లు ప్రారంభం కాకపోయినా ఓటీటీ సత్తా చాటుతోంది. వీటిపై అల్లు అరవింద్ స్పందిస్తూ ఓటీటీ ఎంతగా పాపులర్ అయినా సరే ప్రేక్షకులు థియేటర్లలో చూడటానికి ఇష్టపడతారు. వాటికి ఉండే ఆదరణ వాటికే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఓటీటీకి భవిష్యతు మాత్రం ఉందని తెలిపాడు.

తమ యొక్క ఆహా యాప్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నామని అల్లు అరవింద్ తెలిపాడు. బాలీవుడ్ సూపర్ స్టార్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతోన్నామని పేర్కొన్నాడు. దాదాపు 170 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతోన్నామని ప్రకటించాడు. అయితే ఇప్పుడే వివరాలు ప్రకటించలేమని పేర్కొన్నాడు. మరి ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే. కరోనా కాలంలో సినిమా హాళ్లు తీయలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల వేరే మార్గం లేక OTT పై ఆధార పడ వలసి ఉంటుంది.

Tags :
|

Advertisement