Advertisement

  • నేడే ఒరేయ్ బుజ్జిగా ప్రీ రిలీజ్ ఫంక్షన్... ఎక్కడో తెలుసా?

నేడే ఒరేయ్ బుజ్జిగా ప్రీ రిలీజ్ ఫంక్షన్... ఎక్కడో తెలుసా?

By: Anji Tue, 29 Sept 2020 11:26 AM

నేడే ఒరేయ్ బుజ్జిగా ప్రీ రిలీజ్ ఫంక్షన్... ఎక్కడో తెలుసా?

కరోనా టైమ్ లో సినిమాలు, సినిమా ఫంక్షన్లు అన్నీ మాయం అయిపోయాయి. బహశా పోస్ట్ కరోనా ఫస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇదే నేమో? రాజ్ తరుణ్-హెబ్బా-మాళవిక నాయర్ కాంబినేషన్ లో కొండా విజయ్ కుమార్ డైరక్షన్ లో కేకె రాధామోహన్ నిర్మించిన సినిమా ఒరేయ్ బుజ్జిగా. ఈ సినిమా అక్టోబర్ 2న ఒటిటిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసారు.


ఈ సాయంత్రం ఐటిసి కోహినూర్ హోటల్ లో ఫంక్షన్ ఏర్పాటు చేసారు. అన్ని ప్రీరిలీజ్ ఫంక్షన్ మాదిరిగా పాటలు, డ్యాన్స్ లు అన్నీ మామూలే. రాహుల్ సిప్లిగంజ్ కొన్ని పాటలు పాడతారు. అనూప్ రూబెన్స్ టీమ్ మరి కొన్ని పాటలు పాడతారు. సత్య టీమ్ డ్యాన్స్ లు వుంటాయి.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాదిరిగా ఉపన్యాసాలు మామూలే. ఎటొచ్చీ చీఫ్ గెస్ట్ అన్నదే సమస్య. ఈ విషయంలో అటు ఓటిటి ప్లాట్ ఫారమ్ ఇటు నిర్మాత ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అవి ఫలిస్తే ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ గా వుంటారు. లేదూ అంటే కేవలం ఒరేయ్ బుజ్జిగా టీమ్ మొత్తం మాత్రమే వుంటుంది.

Tags :

Advertisement