Advertisement

  • మరోసారి వెబ్‌సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు రానున్న జగపతిబాబు

మరోసారి వెబ్‌సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు రానున్న జగపతిబాబు

By: chandrasekar Wed, 12 Aug 2020 09:45 AM

మరోసారి వెబ్‌సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు రానున్న జగపతిబాబు


టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జగపతిబాబు లెజెండ్‌ చిత్రంతో నటుడిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం డిజిటల్‌ ప్లాట్‌ఫాంల కాలం నడుస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే జగపతిబాబు రెండేళ్ల క్రితమే గ్యాంగ్‌స్టర్స్‌ చిత్రంతో డిజిటల్‌ ప్రపంచంలో అడుగుపెట్టాడు. ఈ నటుడు‌ తాజాగా మరోసారి వెబ్‌సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమవుతున్నట్టు ఫిలింనగర్‌ లో వార్త షికారు చేస్తోంది.

బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కామీడియావర్క్స్‌ ఈ వెబ్‌సిరీస్‌ను చేసేందుకు సన్నాహాలు చేస్తుందట. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కాని ఈ వెబ్‌సిరీస్‌ సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే జగపతిబాబు‌ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించడం నిశ్చయమైనట్టే అని అంటున్నారు ఫాలోవర్లు. ఈ వెబ్‌సిరీస్‌లో నటీనటుల వివరాలు, ఇతర సాంకేతిక బృందం వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Advertisement