Advertisement

  • నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు

నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు

By: chandrasekar Mon, 31 Aug 2020 10:52 AM

నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు


ఎవర్ యూత్ హీరో అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా అతని అభిమానుల నుండి ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు అందుకుంటున్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన చిన్నా, పెద్ద ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందినవాళ్లు నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పారు.

నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నాగార్జునకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు సినీ ప్రపంచంలో ఎందరో గొప్ప నటుల్లో ఒకరైనా అక్కినేని నాగార్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, మరిన్ని విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను అని సీఎం జగన్ ట్వీట్‌ చేశారు. సీఎం జగన్ ట్వీట్ చేసిన దాదాపు 19 గంటల తర్వాత నాగార్జున స్పందించారు.

అయన చేసిన ట్వీట్ కు సీఎం జగన్ డైనమిక్ లీడర్ అని, తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రియమైన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమపూర్వక మాటలకు ధన్యవాదాలు. మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తున్నాను. నాకు తెలుసు మీ డైనమిక్ లీడర్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంటుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అని నాగార్జున రీ ట్వీట్ చేశారు. ఇందుకు గాను నాగార్జున అభిమానులు సంతోషాన్ని వెలిబుచ్చారు.

Tags :

Advertisement