Advertisement

  • తెలుగు జాతి ఆత్మ గౌరవం నందమూరి తారక రామారావు ...చిరంజీవి

తెలుగు జాతి ఆత్మ గౌరవం నందమూరి తారక రామారావు ...చిరంజీవి

By: Sankar Thu, 28 May 2020 1:00 PM

తెలుగు జాతి ఆత్మ గౌరవం నందమూరి తారక రామారావు ...చిరంజీవి

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు ..అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ పేజీలో ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుభంధాన్ని అభిమానులతో పంచుకున్నాడు...

తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం.. తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం.. నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.. వారితో కలిసి నటించడం నా అదృష్టం.. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..’ అంటూ ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఆనాటి ఫోటోను కూడా ట్విటర్‌లో షేర్‌ చేశారు. 1981లో చిరంజీవి, ఎన్టీఆర్‌లు కలిసి ‘తిరుగులేని మనిషి’ అనే చిత్రంలో నటించిన విషయం తెలసిందే.

మీరు లేని లోటు తీరనిది’ అని పేర్కొంటూ ‘మీ పాదం మోపక తెలుగ ధరిత్రి చిన్నబోతోంది.. మీ రూపు కానుక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా సదా మీ ప్రేమకు బానిసను’ అంటూ యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. వీరితో పాటు నందమూరి కళ్యాణ్‌రామ్‌, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, తదితర టాలీవుడ్‌ ప్రముఖులు ట్విటర్‌ వేదికగా ఎన్టీఆర్‌ ఘన నివాళులర్పించారు.

Tags :
|

Advertisement