Advertisement

  • అనుకున్న తేదీకే రానా , మిహిక పెళ్లి ..దగ్గుబాటి ఫ్యామిలీ

అనుకున్న తేదీకే రానా , మిహిక పెళ్లి ..దగ్గుబాటి ఫ్యామిలీ

By: Sankar Thu, 11 June 2020 08:30 AM

అనుకున్న తేదీకే  రానా , మిహిక పెళ్లి ..దగ్గుబాటి ఫ్యామిలీ


నటుడు రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు అవుతున్న సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన అమ్మాయి మిహీకా బజాజ్‌ను రానా పెళ్లాడబోతున్నారు. వీరి వివాహాన్ని ఖరారు చేస్తూ మే 21న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో రోకా ఫంక్షన్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో దగ్గుబాటి, బజాజ్ ఫ్యామిలీలు పాల్గొన్నాయి. ఈ వేడుక అయిన తరవాత రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పెళ్లి తేదీని కూడా ప్రకటించారు. ఆగస్టు 8న రానా, మిహీకాల వివాహం జరగనున్నట్లు చెప్పారు. ఒకవేళ అప్పటికి లాక్‌డౌన్ అమలులో ఉంటే కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ పెళ్లి వేడుక జరుపుతామని స్పష్టం చేశారు.

కానీ, రానా-మిహీకా పెళ్లి తేదీ మారబోతోందని.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివాహ వేడుకను వాయిదా వేస్తున్నారని వదంతలు వచ్చాయి. అయితే, ఈ వదంతులపై దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించింది. అనుకున్న తేదీకే పెళ్లి జరుగుతుందని స్పష్టం చేసింది. ఆగస్టు 8న మిహీకా మెడలో రానా మూడుముళ్లు వేయబోతున్నారని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లోనే ఈ శుభకార్యాన్ని జరిపేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.

ఈ వివాహ వేడుకను మూడు రోజులపాటు నిర్వహించబోతున్నట్లు రానా కుటుంబ సభ్యులు వెల్లడించారు. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో మెహందీ, సంగీత్ వేడుకలు నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకల్ని నిర్వహించబోతున్నారు. వీరిని నిశ్చితార్థం నిర్వహించడం లేదు. నేరుగా పెళ్లి తంతు జరపబోతున్నారు.

Tags :
|
|

Advertisement