Advertisement

  • సింగిల్ డైలాగ్తో డిస్టర్బ్ చేసిన నివేదా థామస్

సింగిల్ డైలాగ్తో డిస్టర్బ్ చేసిన నివేదా థామస్

By: chandrasekar Wed, 02 Sept 2020 11:52 AM

సింగిల్ డైలాగ్తో డిస్టర్బ్ చేసిన నివేదా థామస్


సోషల్ మీడియా వాడకం పెరగడంతో నటీనటులు తమ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరో నివేదా థామస్ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ సింగిల్ డైలాగ్‌తో డిస్టర్బ్ చేసేసింది. తన లేటెస్ట్ మూవీ V సినిమాలోని కత్తిలాంటి డైలాగ్ చెబుతూ కన్నుకొట్టింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన V సినిమా సెప్టెంబర్ 5న ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. నివేదా థామస్ ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఆసక్తికర వీడియో షేర్ చేసింది. ''ఇది సైడ్ బిజినెస్ మాత్రమే మెయిన్ బిజినెస్ వేరే ఉంది'' అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ఎంతగానో ఆకర్షిస్తోంది.

ఈ చిత్రంలో నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలు పోషించగా నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో నాని ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌గా కనిపించనుండటం విశేషం. నాని కెరీర్‌లో 25వ సినిమాగా V ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు తెగ పెంచేశాయి. నిజానికి ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని ఇన్నాళ్లు వేచి చూసిన చిత్రయూనిట్.. నేటికీ సినిమా హాళ్లు తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైయ్యారు.

Tags :
|

Advertisement