Advertisement

నితిన్‌-షాలినిల పెళ్లి వేడుక‌ పూర్తి

By: chandrasekar Mon, 27 July 2020 07:51 AM

నితిన్‌-షాలినిల  పెళ్లి వేడుక‌ పూర్తి


కరోనా కారణంగా షూటింగ్ లు జరుగక ఇంట్లోనే ఉంటున్న టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరు ఓ ఇంటివారు ఆవుతున్నారు. రానా,నిఖిల్ ఇప్పుడు నితిన్ వరుసగా పెళ్లిళ్లు చేసుకున్నారు. తాజ్ ఫ‌ల‌క్ నుమా హోట‌ల్ లో జ‌రిగిన పెళ్లి వేడుక‌లో రాత్రి 8 గంట‌ల 30 నిమిషాల‌కు నితిన్ కందుకూరి షాలిని మెడ‌లో మూడు మూళ్లు వేశాడు.

క‌రోనా నేప‌థ్యంలో కేవ‌లం కొద్ది మంది స‌న్నిహిత‌లు స‌మ‌క్షంలో పెళ్లి వేడుక జ‌రిగింది. నితిన్‌-షాలిని పెళ్లి వేడుక‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. నితిన్‌-షాలిని కుటుంబ‌స‌భ్యుల‌తోపాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు వేడుక‌కు హాజ‌రై..నూత‌న వ‌ధూవ‌రుల‌కు త‌మ ఆశీర్వ‌చ‌నాలు అందించారు.

Tags :
|

Advertisement