Advertisement

  • ఆకట్టుకుంటున్న నితిన్ పెళ్లి కానుక రంగ్ దే టీజర్

ఆకట్టుకుంటున్న నితిన్ పెళ్లి కానుక రంగ్ దే టీజర్

By: Sankar Sun, 26 July 2020 6:26 PM

ఆకట్టుకుంటున్న నితిన్ పెళ్లి కానుక రంగ్ దే టీజర్



కొత్త పెళ్లి కొడుకు నితిన్ పెళ్లి సందర్భంగా అతని కొత్త చిత్రం అయినా రంగ్ డే యూనిట్ నితిన్ అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చింది ..సరిగ్గా నితిన్ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ కి సింక్ అయ్యేలా ఆ టీజర్ ఉండటంతో రిలీజ్ అయినా కొద్దిసేపటికే వైరల్ అయింది ..ఇక ఈ టీజర్ లో ర్తి సురేష్‌ను నితిన్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు టీజర్‌లో చూపించారు. అది కూడా నితిన్‌కు ఇష్టం లేకుండా. కీర్తి సురేష్ మాత్రం చాలా ఆనందంగా కనిపిస్తోంది.

ఇక పెళ్లయిన తరవాత నితిన్ కిచెన్‌కు అంకితమైపోయాడు. పాత్రలు కడిగేస్తున్నాడు.. బట్టలు ఐరన్ చేసేస్తున్నాడు.. ఫ్లోర్ క్లీన్ చేసేస్తున్నాడు.. మొత్తం మీద ఇంటి పని మొత్తం చేసేస్తున్నాడు. దీనికి తోడు బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ అదిరిపోయింది. ‘బస్టాండే బస్టాండే ఇక నీ బతుకే బస్టాండే’ అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ బాగుంది.

ఇక వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది

Tags :
|

Advertisement