Advertisement

  • మెగాడాటర్ నిహారిక వివాహం లేటెస్ట్ అప్డేట్స్...!

మెగాడాటర్ నిహారిక వివాహం లేటెస్ట్ అప్డేట్స్...!

By: Anji Wed, 02 Dec 2020 8:10 PM

మెగాడాటర్ నిహారిక వివాహం లేటెస్ట్ అప్డేట్స్...!

మెగాడాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్పుర్లో జరగనుంది. అందులో భాగం పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఈ సందర్భంగా 'ఇంకా ఏడు రోజులే' అంటూ కాబోయే భర్త చైతన్యతో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఆమె వివాహ ఆహ్వానపత్రిక(వెడ్డింగ్ కార్డ్) కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

రిచ్ లుక్తో ఉన్న ఈ పెళ్లి శుభలేఖ ఆకట్టుకుంటోంది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది.

త్వరలో రాజస్థాన్ చేరుకోనున్న మెగా కుటుంబ సభ్యులు.. కొన్నిరోజుల క్వారంటైన్లో ఉండి వేడుకకు హాజరవుతారు. ఆ తర్వాత 11వ తేదిన హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు ఇంకా ఏడు రోజులే ఉందని నిహారిక తెగ సంతోషపడిపోతుంది. రిచ్లుక్లో ఉన్న శుభలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Tags :

Advertisement