Advertisement

  • నిహారిక పుట్టిన రోజు... స్పెషల్ విషెస్ చెప్పిన భర్త చైతన్య...!

నిహారిక పుట్టిన రోజు... స్పెషల్ విషెస్ చెప్పిన భర్త చైతన్య...!

By: Anji Fri, 18 Dec 2020 2:42 PM

నిహారిక పుట్టిన రోజు... స్పెషల్ విషెస్ చెప్పిన భర్త చైతన్య...!

నిహారిక కొణిదెలగా ఫుల్ పాపులర్ అయిన మెగా డాటర్ ఇప్పుడు ఇంటి పేరు మార్చుకొని నిహారిక జొన్నలగడ్డగా మారిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యను పెళ్లాడి ఓ ఇంటిదైన నిహారిక.. ప్రస్తుతం అత్తారింటిలో ఖుషీ ఖుషీగా కనిపిస్తోంది.

అత్తారింట్లో మెగా డాటర్ చేస్తున్న సందడి తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే.. ఓ స్పెషల్ డే రానే వచ్చింది.

అదే నిహారిక పుట్టినరోజు. నేడు (డిసెంబర్ 18) నిహారిక బర్త్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ పోస్ట్ పెట్టారు చైతన్య.

మెట్టినింట అడుగుపెట్టాక నిహారిక సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ బర్త్ కావడంతో ఇరు కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. నేటితో ఈ కొత్త పెళ్లి కూతురు 27 వసంతాలు పూర్తిచేసుకొని 28 వ వసంతంలోకి అడుగుపెడుతోంది.

ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు వెల్లువలా విషెస్ పోస్ట్ చేస్తుండగా.. నిహారిక భర్త చైతన్య ఆమెపై ఉన్న ప్రేమను బయటపెడుతూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

''హ్యాపీ బర్త్ డే లవ్.. నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్'' అని పేర్కొంటూ ఆమెను కౌగిలిలో బంధించి దిగిన ఓ స్పెషల్ ఫొటో షేర్ చేశారు చైతన్య.

నిహారిక తన జీవితానికి సన్ ఫ్లవర్ అని ఆయన పోల్చడం మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. చైతన్య పోస్ట్ చేసిన ఈ ఫొటో చూసి 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Tags :

Advertisement