Advertisement

  • మాల్దీవుల్లో ల్యాండ్ అయిన నిహరిక, చైతన్య...!

మాల్దీవుల్లో ల్యాండ్ అయిన నిహరిక, చైతన్య...!

By: Anji Sun, 27 Dec 2020 3:46 PM

మాల్దీవుల్లో ల్యాండ్ అయిన నిహరిక, చైతన్య...!

డిసెంబర్ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు చైతన్య జొన్నలగడ్డతో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.

ఈ పెళ్లి వేడుకకు మెగా , అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రెస్పెషన్ చేసుకోగా..ఇండస్ట్రీ లోని సినీ పెద్దలు, నటి నటులు హాజరయ్యారు.

ప్రస్తుతం ఈ కొత్త జంట హానీ మూన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వారం రోజుల పాటు గడిపేందుకు కొన్ని గంటల ముందు వారు విమానం ఎక్కేశారు.

ఇప్పటికే మాల్దీవుల్లో ల్యాండ్ అయిన నిహరిక అందుకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ వస్తోంది.

Tags :

Advertisement