Advertisement

  • చైతన్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

చైతన్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

By: chandrasekar Mon, 27 July 2020 5:19 PM

చైతన్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్


నిహారిక చైతన్యతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఆగస్టులో నిహారిక-చైతన్య నిశ్చితార్థం, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనుందని ఇప్పటికే వదంతులు వచ్చాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన అయితే ఏమీ రాలేదు. ఇదిలా ఉంటే, తనకు కాబోయే భర్తతో తీసుకున్న ఫొటోలను తాజాగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ఈ ఫొటోలు షేర్ చేయడానికి కారణం ఆదివారం (జులై 26న) చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ‘‘ఒక చిరునవ్వు మొత్తం గదిని కాంతివంతం చేస్తుంది. కౌగిలింతలు ఇల్లులా అనిపిస్తాయి. నువ్వు నీ దగ్గర నేను ఎంతో సంతోషంగా ఉంటాను చే’’ అని తన కాబోయే భర్తపై ప్రేమను చాటుకున్నారు నిహారిక.

ఈ పెళ్లిని మెగాస్టార్ చిరంజీవి కుదర్చినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉందట. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులని సమాచారం. అందువల్ల ఈ రెండు కుటుంబాలు చాలా కాలంగా టచ్‌లో ఉన్నాయట. నిహారికకు పెళ్లి సంబంధాలు చూడాలని నాగబాబు అన్నప్పుడు చిరంజీవికి వెంటనే చైతన్య గుర్తుకువచ్చారట. దీంతో ఐజీ ప్రభాకర్ రావుతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Tags :

Advertisement