Advertisement

  • బాబాయ్ సినిమాలో అబ్బాయి అంటూ వైరల్ అవుతున్న వార్త ..నిజం అవ్వాలని కోరుకుంటున్న మెగా ఫాన్స్

బాబాయ్ సినిమాలో అబ్బాయి అంటూ వైరల్ అవుతున్న వార్త ..నిజం అవ్వాలని కోరుకుంటున్న మెగా ఫాన్స్

By: Sankar Fri, 03 July 2020 4:47 PM

బాబాయ్ సినిమాలో అబ్బాయి అంటూ వైరల్ అవుతున్న వార్త ..నిజం అవ్వాలని కోరుకుంటున్న మెగా ఫాన్స్



సినిమా ఇండస్ట్రీ లో ఏదయినా ఒక పెద్ద సినిమా హీరో జరుగుతుందంటే ఆ సినిమాకు సంబంధించి అనేక వార్తలు బయటకు వస్తాయి అందులో కొన్ని నిజం ఉంటాయి , మరికొన్ని కొంతమంది కావాలని సృష్టించెను ఉంటాయి ..ఇటీవలి కాలంలో సినిమా పేర్లను దర్శకత , నిర్మాతలు ప్రకటించకముందే బయటకు వచ్చిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం ..తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , క్రిష్ ల కాబినేషనలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ..ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందంలో తేలియాడుతున్నారు. అంతేకాకుండా ఆ వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటిందంటే.. పవన్‌-క్రిష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ కనిపించనున్నారట..

అయితే అది ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ కాదంట కేవలం అతిథి పాత్రలో చెర్రీ మెరవనున్నాడట. అంతేకాకుండా కనిపించేది కొద్దిసేపే అయినా చాలా పవర్‌ ఫుల్‌గా ఉండనుందట చరణ్‌ పాత్ర. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ వార్త నిజమైతే మెగా అభిమానులకు శుభవార్తే. ఇప్పటికే రామ్‌చరణ్‌ తన తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ‘ఆచార్య’ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు..

ప్రస్తుతం పవర్ స్టార్ దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకుడిగా చేస్తున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు ..క్రిష్ తో నటించే సినిమా ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు ..అయితే కరోనా కారణంగా అన్ని షూటింగ్స్ నిరవధికంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే ..అయితే హైదరాబాద్ లో ఒక బారి సెట్ వేసి పవన్ లేకుండానే తొలి షెడ్యూల్ తీసే ప్లానింగ్ లో క్రిష్ ఉన్నాడని సమాచారం ..

Tags :
|
|

Advertisement