Advertisement

  • రవితేజ క్రాక్ సినిమా నుంచి కొత్త సాంగ్ విడుదల

రవితేజ క్రాక్ సినిమా నుంచి కొత్త సాంగ్ విడుదల

By: Sankar Mon, 14 Dec 2020 1:15 PM

రవితేజ క్రాక్ సినిమా నుంచి కొత్త సాంగ్ విడుదల


మాస్ మహారాజ రవితేజ అంటేనే ఫుల్ ఎనర్జీ ...ఇప్పుడంటే స్పీడ్ కొంచెం తగ్గింది కానీ కొంతకాలం క్రితం వరకు వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు ..తాజాగా తనతో డాన్ శ్రీను వంటి సినిమా చేసిన గోపీచంద్ మలినేనితో క్రాక్ సినిమా చేస్తున్నాడు..ఇందులో హీరోయిన్ గా చాలా గ్యాప్ తర్వాత శృతి హాసన్ నటిస్తుంది ..ఇప్పటికే ఈ ఇద్దరి కలయికలో బలుపు వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది..

ఇక ఈ క్రాక్ సినిమా వాస్తవ సంఘటల ఆధారంగా తెరకెక్కుతుంది. ఇందులో రవితేజ పవరు ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నాడు. అయితే ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల విశేష స్పందన అందుకున్నాయి. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి బలే తగిలావే బంగారం పాట టీజర్‌ను విడుదల చేశారు.

అయితే నేడు ఈ పాటకు సంబంధించి లిరికల్ వీడియోను రలీజ్ చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, అనిరుద్ ఓకల్స్ ఇచ్చాడు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు..అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది

Tags :

Advertisement