Advertisement

  • భవిష్యత్తులో ఓటిటిల హవా పెరగొచ్చు .. హీరో నవీన్ చంద్ర

భవిష్యత్తులో ఓటిటిల హవా పెరగొచ్చు .. హీరో నవీన్ చంద్ర

By: Sankar Sun, 28 June 2020 1:31 PM

భవిష్యత్తులో ఓటిటిల హవా పెరగొచ్చు .. హీరో నవీన్ చంద్ర



నవీన్ చంద్ర ..తొలుత హీరోగా అందాల రాక్షషి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ హీరోగా అంత మంచి అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నాడు ..అయితే నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ మూవీ భానుమతి రామకృష్ణ ఓటిటి లో వచ్చే నెల మూడున ఆహాలో విడుదల కానుంది ..దీనితో ఈ సినెమా విశేషాల గురించి ఒక ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నాడు ..

ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా దర్శకుడు శ్రీకాంత్‌ పరిచయం అయ్యారు. ఓ సందర్భంలో ‘భానుమతి రామకృష్ణ’ కథ చెప్పారు. డైరెక్షన్‌ చేయమని నేనే చెప్పాను. బట్టతల, కొంచెం బొద్దుగా ఉండటం, తెనాలి యాస ఇలా.. రామకృష్ణ పాత్రను ఊహించుకున్నారు శ్రీకాంత్‌. నా ఊహల్లో ఉన్న రామకృష్ణ గురించి శ్రీకాంత్‌కు చెప్పాను. ఇద్దరం మాట్లాడుకుని ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యే రామకృష్ణను రెడీ చేశాం.

ఈ సినిమాను ఏ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయాలో ముందుగా ప్లాన్‌ చేయలేదు. ప్రస్తుతం థియేటర్స్‌ లేవు. ఓటీటీ బాగుందని ఈ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నాం. భవిష్యత్‌లో ఓటీటీల హవా పెరగవచ్చు. థియేటర్స్‌ ఉన్నప్పుడు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. ఒక సినిమా ప్రేక్షకుడికి నచ్చి ఆ సినిమాను మళ్లీ చూడాలనుకున్నప్పుడు థియేటర్‌లో అయితే టికెట్‌ కొనాలి.

అదే ఓటీటీలో మళ్లీ టికెట్‌ కొనాల్సిన అవసరం ఉండదు. అయితే ఓ ఐదొందల మంది మధ్యలో థియేటర్‌లో వినోదాన్ని ఆస్వాదించే అనుభూతి ఎప్పుడూ బాగుంటుంది. అదొక ఫెస్టివల్‌లాంటిది. కరోనా వల్ల పరిస్థితులు బాగాలేవు. మునుపటి సాధారణ రోజులు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఈ లాక్‌డౌన్‌ని టీవీ చూడటం, ఇల్లు శుభ్రం చేయడం, వార్తలను ఫాలో కావడం, వర్కవుట్‌ చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడానికి కేటాయించాను.

ఇక ప్రస్తుతం తెలుగులో రానా ‘విరాటపర్వం’, కీర్తీ సురేష్‌ ‘మిస్‌ ఇండియా’ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. అలాగే వరుణ్‌ తేజ్‌ సినిమాలో బాక్సర్‌గా కనిపిస్తాను. దర్శకులు మంచి పాత్రలతో నన్ను అప్రోచ్‌ అవుతుండటం సంతోషంగా ఉంది అని అన్నారు ..

Tags :
|

Advertisement