Advertisement

  • న్యాచురల్ స్టార్ నాని , సుధీర్ బాబు V సినిమా రిలీజ్ పై నేడు ప్రకటన చేయనున్న చిత్ర యూనిట్

న్యాచురల్ స్టార్ నాని , సుధీర్ బాబు V సినిమా రిలీజ్ పై నేడు ప్రకటన చేయనున్న చిత్ర యూనిట్

By: Sankar Thu, 20 Aug 2020 09:10 AM

న్యాచురల్ స్టార్ నాని , సుధీర్ బాబు V సినిమా రిలీజ్ పై నేడు ప్రకటన చేయనున్న చిత్ర యూనిట్


నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషించిన ‘V’ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారం ఇప్పుడు నిజం కాబోతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల కాబోతోంది. ఆ ప్లాట్‌ఫాం ఏంటి అనేది రేపు తెలియబోతోంది. ఈ మేరకు బుధవారం నాని ఒక ప్రకటన చేశారు. ఆసక్తికరమైన వీడియోను వదిలారు. ఇంట్లోనే థియేటర్ అంటూ రేపు అనగా ఆగష్టు 20న V టీమ్ కీలక ప్రకటన చేయబోతోందని చెప్పారు.

ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా భయానక పరిస్థితులకు ముందు మార్చిలో విడుదల కావాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో విడుదల ఆగిపోయింది. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని ఇన్నాళ్లు వేచి చూశారు. కానీ, సినిమా హాళ్లు తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో నేరుగా ఓటీటీలో విడుదల చేసేస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. అలాగే, టీజర్ కూడా వచ్చింది.

ఇదిలా ఉంటే, V సినిమా విడుదల కాబోయే ఓటీటీ ప్లాట్‌ఫాం ఏమిటి? ట్రైలర్ ఎప్పుడు? వంటి విషయాలను బహుశా చిత్ర యూనిట్ వెల్లడించవచ్చు. కానీ, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో V ప్రీమియర్ కానుందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలిసిపోతుంది.

Tags :
|
|
|

Advertisement