Advertisement

  • నా పైన ఇంత ప్రేమను నేను అప్పుడు ఉహించలేదు..న్యాచురల్ స్టార్ నాని

నా పైన ఇంత ప్రేమను నేను అప్పుడు ఉహించలేదు..న్యాచురల్ స్టార్ నాని

By: Sankar Wed, 09 Sept 2020 10:38 AM

నా పైన ఇంత ప్రేమను నేను అప్పుడు ఉహించలేదు..న్యాచురల్ స్టార్ నాని


నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘V’ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నాని నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌ను నాని చాలా బాగా చేశారని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.

తన సినిమాను ఆదరించడంతో పాటు, తన నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తోన్న ప్రేక్షకులు, అభిమానులకు నాని కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నాపై ఇంతటి ప్రేమ, ఆదరణ లభిస్తుందని 12 ఏళ్ల క్రితం నా మొదటి సినిమా విడుదలైనప్పుడు నేను ఊహించలేదు’’ నాని తెలిపారు.

‘‘మొదటిసారి ఒక నెగిటివ్ రోల్ చేసినప్పటికీ అభిమానులు నన్ను ఎంతగానో ఆదరించారు. నా 25వ సినిమాపై ఇంతటి అభిమానం చూపించిన అందరికీ కృతజ్ఞతలు. నా సినిమా విడుదలైతే థియేటర్స్ దగ్గరికి ఆడియన్స్ వస్తారు. కానీ ఈసారి నేను, మా ‘V’ టీమ్ మొత్తం మీ ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అని నాని అన్నారు.

Tags :
|
|

Advertisement