Advertisement

  • మరీ అంత నాచురల్ గా ఉన్నావేంట్రా..నాంది టీజర్ పై నాచురల్ స్టార్ నాని కామెంట్స్

మరీ అంత నాచురల్ గా ఉన్నావేంట్రా..నాంది టీజర్ పై నాచురల్ స్టార్ నాని కామెంట్స్

By: Sankar Tue, 30 June 2020 7:16 PM

మరీ అంత నాచురల్ గా ఉన్నావేంట్రా..నాంది టీజర్ పై నాచురల్ స్టార్ నాని కామెంట్స్



తెలుగు సినిమాల్లో ఒక హీరో నుంచి కొత్త సినిమా గురించి ఏదయినా న్యూస్ వస్తే దానికి వేరే హీరోలు రియాక్ట్ అవ్వడం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం ..అయితే తాజాగా అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమా అయినా నాంది నుంచి టీజర్ రిలీజ్ చేసారు ..ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే గాక, టీజర్‌లో అల్లరోడి అవతారం, డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. దీంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా ఈ 'నాంది' టీజర్ చూసిన నాని.. తనదైన స్టైల్ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు.

అదిరింది రా.. నీకు, నీ సరికొత్త అవతారానికి జన్మదిన శుభాకాంక్షలు. `నాంది` సినిమా కోసం వెయిట్ చేస్తున్నా` అంటూ నాని ట్వీట్ చేశాడు. ఈ మేరకు తన బర్త్ డే సర్‌ప్రైజ్ అని పేర్కొంటూ అల్లరి నరేష్ చేసిన ట్వీట్ ట్యాగ్ చేశాడు. కేవలం హీరోలుగానే కాక నిజ జీవితంలో కూడా అల్లరి నరేష్, నాని మంచి స్నేహితులు కావడంతో ఈ ట్వీట్ చూసి ఇరువురి అభిమానులు మురిసిపోతున్నారు..

విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న నాంది సినిమాకు స‌తీష్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. అల్లరి నరేష్ కెరీర్‌లో ఇది 57వ సినిమా..సుడిగాడు తర్వాత మల్లి ఆ స్థాయి హిట్ సినిమా లేక ఇటీవల కాలంలో కొంచెం స్లో అయిన అల్లరి నరేష్ టైం తీసుకొని వస్తున్నాడు ..దీనితో ఈ సినిమా హిట్ అయి నరేష్ తిరిగి ఫామ్ లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు

Tags :
|
|

Advertisement