Advertisement

  • దీపావళి కానుకగా కొత్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన నాని

దీపావళి కానుకగా కొత్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన నాని

By: Sankar Fri, 13 Nov 2020 12:06 PM

దీపావళి కానుకగా కొత్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన నాని


యంగ్ హీరో నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు నాని కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.

ఇక ఈ సినిమా తర్వాత టాక్సీవాల సినిమా తో హిట్ అందుకున్న దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తో పాటు నాని కి నిన్ను కోరి వంటి హిట్ సినిమా ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు నాని నటించబోయే 28వ సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది. మైత్రిమూవీస్ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా లో నాని సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నానికి జోడిగా నటిస్తుంది. 'రాజారాణి' సినిమాతో నజ్రియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక ఈ సినిమా టైటిల్ ను నవంబర్ 21న అనౌన్స్ చేయనున్నారు. ఈమేరకు చిత్రయూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసారు.

Tags :
|

Advertisement